RRB GROUP D STUDY METERIAL

కేవలం పదో తరగతి లేదా ఐటీఐతో రైల్వేలో గ్రూప్-డి ఉద్యోగాన్ని పొందడానికి ఆర్ఆర్‌బీ రాత పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండవు. రాత పరీక్షల్లో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
గ్రూప్-డి కేటగిరీ పోస్టుల భర్తీకి ఈ ఏడాది మే మొదటి వారం నుంచి రాత పరీక్షలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రూప్-డి పరిధిలోకి వచ్చే కేటగిరీల వివరాలు, పరీక్ష సిలబస్ తదితరాంశాల గురించి తెలుసుకుందాం.
గ్రూప్-డి కేటగిరీ పోస్టులు:
1) హెల్పర్ - కలాశీ.
2) కూప్లింగ్ కలాశీ (ఎల్‌సీ పోర్టర్, బాక్స్ పోర్టర్).
3) గేట్‌మ్యాన్ (హెల్పర్ / ట్రాలీమ్యాన్)
4) హమాలీ (హెల్పర్ కలాశీ, డీజిల్ కలాశీ).
5) ట్రాక్‌మ్యాన్/ గ్యాంగ్‌మ్యాన్
6) హెల్పర్ (మెకానికల్, ఎలక్ట్రికల్).
7) సఫాయీవాలా (మెడికల్, కమర్షియల్, మెకానికల్, డిపో).
ఈ పోస్టులకు మొదట దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి దీన్లో అర్హత సాధించిన వారిని రాత పరీక్షలకు ఆహ్వానిస్తారు. రాత పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో సాగుతుంది. దీన్లో జనరల్‌నాలెడ్జ్/ అవేర్‌నస్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, రీజనింగ్ అంశాలపై ప్రశ్నలు వస్తాయి. ఇవి పదో తరగతి స్థాయిలో ఉంటాయి. రాత పరీక్షలో ప్రతిభ చూపిన వారి సర్టిఫికెట్లు తనిఖీ చేసి, వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

Total Pageviews

Template Information

Template Information