ఫోర్బ్స్ జాబితాలో మెర్కెల్‌కు మొదటి స్థానం
2012 సంవత్సరానికి ప్రపంచంలో శక్తివంతులైన మహిళల జాబితాను ఫోర్బ్స్ పత్రిక ఆగస్టు 22న విడుదల చేసింది. 100 మంది మహిళలతో కూడిన జాబితాలో జర్మనీ ఛాన్స్‌లర్ ఎంజెలా మెర్కెల్‌కు మొదటి స్థానం దక్కింది. గతేడాది ఆమె రెండోస్థానంలో ఉన్నారు. ద్వితీయస్థానంలో అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ , తృతీయ స్థానంలో బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ నిలిచారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్‌కు ఏడోస్థానం దక్కింది.

ఈ
జాబితాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోస్థానంలో
నిలిచారు. గత సంవత్సరం ఈ జాబితాలో ఆమెకు ఏడోస్థానం దక్కింది. భారత్‌కు
చెందిన ఇంద్ర నూయీ(పెప్సీ కంపెనీ చైర్మన్) 12వ స్థానం, పదశ్రీ వారియర్
(సిస్కో సిస్టమ్స్ సీటీవో) 58వ స్థానం, చందా కొచ్చర్ (ఐసీఐసీఐ సీఈవో)59వ
స్థానం, కిరణ్ మజుందార్‌షా(బయోకాన్ అధిపతి) 80వ స్థానంలో ఉన్నారు.
పాలపుంతను పోలిన జంట గెలాక్సీలు
అంతరిక్షంలో మన పాలపుంతను పోలిన జంట గెలాక్సీలను ఖగోళ శాస్త్రవేత్తలు తొలిసారిగా కనుగొన్నారు. పాలపుంత తరహా వర్తులాకారపు గెలాక్సీలు విశాల విశ్వంలో సర్వసాధారణంగా కనిపించేవే అయినా, తాజాగా గుర్తించిన జంట గెలాక్సీల్లో మన పాలపుంత మాదిరి పోలికలు చాలా కనిపించాయి. ఈ జంట గెలాక్సీల్లోనూ పాలపుంత మాదిరిగానే ఉపగ్రహ కక్ష్యలూ, మగెలానిక్ మేఘాలూ ఉన్నాయి. పాలపుంతలో కనిపించే అతి అరుదైన మగెలానిక్ మేఘాలు తాజాగా గుర్తించిన జంట గెలాక్సీల్లోనూ కనిపిస్తున్నాయని వెస్టర్న్ ఆస్ట్రేలియా వర్సిటీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ ఆరోన్ రాబోథమ్ చెప్పారు.

డబ్ల్యూటీవోలో చేరిన రష్యా
ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)లో రష్యా ఆగస్టు 22న చేరింది. 18 సంవత్సరాల చర్చల తర్వాత డబ్ల్యూటీవోలో రష్యా సభ్యత్వం పొందింది. గత జూలైలో రష్యా ఉభయ సభలు డబ్ల్యూటీవోలో చేరికకు ఆమోదం తెలిపాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో సమతూకం సాధించేందుకు దిగుమతి సుంకాలు, సబ్సిడీలపై డబ్ల్యూటీవో ఆంక్షలు విధిస్తుంది. డబ్ల్యూటీవో చేరిక వల్ల తయారీ రంగం, వ్యవసాయ రంగం దెబ్బతింటాయని రష్యా ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇథియోపియా ప్రధాని జెనావీ మృతి
ఇథియోపియా ప్రధాన మంత్రి మెలెస్ జెనావీ(57) అనారోగ్యంతో ఆగస్టు 21న మరణించారు. జెనావీ 1995 నుంచి ఇథియోపియా ప్రధానిగా ఉన్నారు. 1991లో నియంత కల్నల్ యెంగిస్లూ హైలే మారియ్ పాలన ముగియడంతో మెలెస్‌కు చెందిన ఇథియోపియన్ పీపుల్స్ రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. జెనావీ 1995, 2000, 2005, 2010 ఎన్నికల్లో విజయం సాధించారు.

అమెరికా హైపర్ సోనిక్ విమాన పరీక్ష విఫలం
అమెరికా ప్రయోగించిన ‘ఎక్స్-51ఏ వేవ్ రైడర్’ అనే మానవ రహిత విమాన పరీక్ష విఫలమైంది. గంటకు 6,900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు ఉద్దేశించిన ఈ విమాన పరీక్షను ఆగస్టు 14న నిర్వహించింది. స్కామ్ జెట్ ఇంజిన్‌తో నడిచే వేవ్ రైడర్ నియంత్రణ కోల్పోయి పసిఫిక్ మహాసముద్రంలో కూలింది.