అంధత్వ నివారణపై అంతర్జాతీయ సదస్సు
ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్‌నెస్ (ఐఏసీబీ) తొమ్మిదో శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్ 20న హైదరాబాద్‌లో ముగిసింది. కంటి ఆరోగ్య పరిరక్షణ, అంధత్వ నివారణకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయించాలని సదస్సు కోరింది. ఐక్యరాజ్య సమితి ‘విజన్ 2020’లో భాగంగా అంధత్వ నివారణపై తీసుకున్న చర్యల ప్రగతిని సదస్సు సమీక్షించింది. అంధత్వ నివారణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టే చర్యలకు ఐఏసీబీ సహకరిస్తుందని సదస్సు డిక్లరేషన్ పేర్కొంది. ప్రపంచ వ్యాప్త అంధత్వ నివారణ సంస్థలు, పరిశోధన శాలలకు చెందిన 1500 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
ప్రపంచ హిందీ సదస్సు
తొమ్మిదో ప్రపంచ హిందీ సదస్సును జోహెన్నస్‌బర్గ్ (దక్షిణాఫ్రికా)లో సెప్టెంబర్ 22న భారత విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ప్రణీత్ కౌర్, దక్షిణాఫ్రికా ఆర్థిక మంత్రి ప్రవీణ్ గోవర్థన్ ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా హిందీ భాషకు ప్రాచుర్యం కల్పించేందుకు మూడు రోజులపాటు ఈ సదస్సు నిర్వహించారు. 1975లో తొలి సదస్సు జరిగింది. ఈ సదస్సులో అనేక హిందీ పుస్తకాలు, ప్రచురణలు ప్రదర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా హిందీ మాట్లాడే వారి సంఖ్య 200 మిలియన్లని అంచనా. ప్రపంచంలో అధిక జనాభా మాట్లాడే భాషల్లో హిందీ ఒకటి.
స్పేస్ వాక్‌లో సునీత రికార్డు
భారత సంతతికి చెందిన మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ అత్యధిక సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. సెప్టెంబర్ 5న ఆమె ఆరో స్పేస్ వాక్‌తో 44 గంటల 2 నిమిషాలు పూర్తి చేశారు. ఈ వాక్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మరమ్మతులు చేశారు. గతంలో పెగ్గీ విట్సన్ పేరుతో 39గంటల 46 నిమిషాలు ఉన్న స్పేస్ వాక్ రికార్డును సునీతా విలియమ్స్ అధిగమించారు.
తీవ్రవాద వ్యతిరేక పోరాటం, ప్రజాస్వామ్యాన్ని పెంపొందించడం, ధనిక-పేద, పేద-పేద దేశాల సహకారం వంటి అంశాలను కూడా సదస్సులో చర్చించారు. భారత్ తరఫున ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ సదస్సులో పాల్గొన్నారు. ఆగస్టు 30-31న రెండు రోజులుపాటు జరిగిన ఈ సదస్సులో 118 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
అజర్‌బైజాన్ రిపబ్లిక్, ఫిజి కొత్త సభ్యులుగా నామ్‌లో చేరాయి. 2012 నాటికి 120 దేశాలు సభ్యదేశాలుగా, 17 దేశాలు పరిశీలక హోదాను కలిగి ఉన్నాయి. అంతకుముందు నాలుగు రోజులు పాటు అధికారుల, మంత్రుల సమావేశాలు జరిగాయి. 17వ నామ్ సదస్సు 2015లో వెనెజులాలో జరుగుతుంది.
1961లో నాటి యుగోస్లేవియాలో అలీనోద్యమం ఏర్పడింది. ఐక్యరాజ్య సమితిలోని మూడింట రెండు వంతుల దేశాలకు నామ్ ప్రాతినిధ్యం వహిస్తోంది, ప్రపంచ జనాభాలో 55 శాతం మంది ప్రజలు నామ్ దేశాల్లో నివసిస్తున్నారు.
ఖండాంతర క్షిపణిని పరీక్షించిన చైనా
ఖండాంతర క్షిపణి ‘డాంగ్‌ఫెంగ్-41’ని గత నెలలో పరీక్షించినట్లు చైనా ఆగస్టు 28న ప్రకటించింది. ఈ క్షిపణి 14,000 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఇది అమెరికాతో సహా ప్రపంచంలోని అనేక ఖండాలను చేరుకోగలదు. 10 అణ్వాయుధాలను మోసుకుపోగలదు. ఇది చైనా రూపొందించిన మూడో తరం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. భారత్ తన ఖండాంతర క్షిపణి ‘అగ్ని-5ను ఏప్రిల్‌లో పరీక్షించింది. ఇది 5,000 కిలోమీటర్లు దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.
ఉత్తరకొరియాలో తైఫూన్‌బలవెన్
ఉత్తరకొరియాలో ‘తైఫూన్‌బలవెన్’ తుపాను వల్ల ఆగస్టు 28న 15 మంది మరణించారు. దీనివల్ల పంటలు, విద్యుత్ సరఫరా దెబ్బతిన్నాయి.
అమెరికాలో ఐసాక్ తుపాను: ఆగస్టు 28న అమెరికాలో సంభవించిన ‘ఐసాక్’ తుపాను వల్ల అనే క ప్రాంతాలు దెబ్బతిన్నాయి. న్యూ ఒర్లీన్స్, మిసిసిపి, లూసియానాలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఏడేళ్ల క్రితం అమెరికా గల్ఫ్ తీరంలో సంభవించిన హరికేన్ కత్రినా వల్ల 1800 మంది మరణించారు.
సిద్ధార్థ దేవ్‌కు అమెరికా సాహిత్య అవార్డు
భారతీయ రచయిత సిద్ధార్థ దేవ్‌కు అమెరికా సాహిత్య పురస్కారం ‘పెన్ ఓపెన్ బుక్’ అవార్డు లభించింది. ‘ద బ్యూటిఫుల్ అండ్ ది డామ్డ్: ఏ పోట్రెయెట్ ఆఫ్ ది న్యూ ఇండియా’ అనే నాన్-ఫిక్షన్ పుస్తకం రాసినందుకు గాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది. అధిక జీతాలు పుచ్చుకునే కాల్ సెంటర్ ఉద్యోగుల నుంచి ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల దాకా పలు వర్గాల ప్రజల జీవితాల గురించి ఆయన చక్కగా వివరించారని కొనియాడారు. ‘పెన్’ అవార్డు కింద 5 వేల డాలర్ల నగదు బహుమతి ఇస్తారు.
సింగపూర్ సీజేగా భారత సంతతి జడ్జి
సింగపూర్ కొత్త ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా భారత సంతతికి చెందిన జడ్జి సుందరేశ్ మీనన్ నియమితులయ్యారు. భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి సింగపూర్‌లో ఈ అత్యున్నత పదవిని చేపట్టడం తొలిసారి. ప్రస్తుతం సింగపూర్ అప్పీల్ జడ్జిగా ఉన్న మీనన్ నవంబర్ 6న కొత్త బాధ్యతలు చేపడతారు.
Relateఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్‌నెస్ (ఐఏసీబీ) తొమ్మిదో శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్ 20న హైదరాబాద్‌లో ముగిసింది. కంటి ఆరోగ్య పరిరక్షణ, అంధత్వ నివారణకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయించాలని సదస్సు కోరింది. ఐక్యరాజ్య సమితి ‘విజన్ 2020’లో భాగంగా అంధత్వ నివారణపై తీసుకున్న చర్యల ప్రగతిని సదస్సు సమీక్షించింది. అంధత్వ నివారణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టే చర్యలకు ఐఏసీబీ సహకరిస్తుందని సదస్సు డిక్లరేషన్ పేర్కొంది. ప్రపంచ వ్యాప్త అంధత్వ నివారణ సంస్థలు, పరిశోధన శాలలకు చెందిన 1500 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
ప్రపంచ హిందీ సదస్సు
తొమ్మిదో ప్రపంచ హిందీ సదస్సును జోహెన్నస్‌బర్గ్ (దక్షిణాఫ్రికా)లో సెప్టెంబర్ 22న భారత విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ప్రణీత్ కౌర్, దక్షిణాఫ్రికా ఆర్థిక మంత్రి ప్రవీణ్ గోవర్థన్ ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా హిందీ భాషకు ప్రాచుర్యం కల్పించేందుకు మూడు రోజులపాటు ఈ సదస్సు నిర్వహించారు. 1975లో తొలి సదస్సు జరిగింది. ఈ సదస్సులో అనేక హిందీ పుస్తకాలు, ప్రచురణలు ప్రదర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా హిందీ మాట్లాడే వారి సంఖ్య 200 మిలియన్లని అంచనా. ప్రపంచంలో అధిక జనాభా మాట్లాడే భాషల్లో హిందీ ఒకటి.
వాల్దివోస్తోక్‌లో అపెక్ సదస్సు
రష్యాలోని వాల్దివోస్తోక్‌లో ఆసియా పసిఫిక్ దేశాల ఆర్థిక సహకార (అపెక్) గ్రూప్ సదస్సు సెప్టెంబర్ 8-9 తేదీల్లో జరిగింది. అపెక్ గ్రూపులోని 21 సభ్యదేశాల నాయకులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రపంచ ఆర్థిక స్థితి, ఆహార భద్రత, పెరుగుతున్న స్వీయ రక్షణ చర్యల పట్ల సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. ‘గ్రీన్ టెక్నాలజీ’పై దిగుమతి సుంకం తగ్గింపు, వృద్ధిని పెంచేందుకు చర్యలు, యూరో రుణ సంక్షోభం వల్ల ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు వాణిజ్య సరళీకరణ వంటి చర్యలకు సదస్సు అంగీకరం తెలిపింది. ఎకో ఫ్రెండ్లీ పరికరాలైన సోలార్ బ్యాటరీస్, విండ్ టర్బైన్స్, వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్ టెక్నాలజీలపై సుంకాలను 2015 నాటికి 5 శాతం లేదా అంతకంటే తక్కువకు తగ్గించాలని నిర్ణయించింది. 2013 అపెక్ సదస్సు ఇండోనేషియాలోని బాలీలో జరుగుతుంది.
సోమాలియా అధ్యక్షుడిగా హసన్
సోమాలియా నూతన అధ్యక్షుడిగా హసన్ షేక్ మొహముద్ ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 9 జరిగిన ఎన్నికల్లో 190 మంది పార్లమెం టు సభ్యులు హసన్‌కు అనుకూలంగా ఓటు వేశారు. మాజీ అధ్యక్షుడు షేక్ షరీఫ్ అహ్మద్‌కు 79 ఓట్లు మాత్రమే వచ్చాయి. హసన్ నాలుగేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. సోమాలియాలో 1991 నుంచి స్థిరమైన కేంద్రప్రభుత్వం ఏర్పాటు కాలేదు.
వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు
69వ వె నిస్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులను సెప్టెంబర్ 8న ప్రదానం చేశారు. వివరాలు..
ఉత్తమ చిత్రం (గోల్డెన్ లైన్ ప్రైజ్): ‘పీటా’, దర్శకత్వం కిమ్ కి డుక్ (దక్షిణ కొరియా)
ఉత్తమ దర్శకుడు (సిల్వర్ లైన్): పౌల్ థామస్ అండెర్సన్ (చిత్రం: ది మాస్టర్)
ఉత్తమ నటుడు: జాక్విన్ పోయినిక్స్, ఫిలప్ సేమౌర్
ఉత్తమ నటి: హదాస్ యారోన్ (ఇజ్రాయెల్)

చైనాలో నైరుతి ప్రాంతంలో భూకంపం
చైనాలో నైరుతి ప్రాంతంలోని యునాన్ ప్రావిన్స్‌లో సెప్టెంబర్ 7న సంభవించిన భారీ భూకంపం ధాటి కి 64 మంది మరణించారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది.
చైనాలో నైరుతి ప్రాంతంలోని యునాన్ ప్రావిన్స్‌లో సెప్టెంబర్ 7న సంభవించిన భారీ భూకంపం ధాటి కి 64 మంది మరణించారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది.
స్పేస్ వాక్‌లో సునీత రికార్డు
భారత సంతతికి చెందిన మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ అత్యధిక సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. సెప్టెంబర్ 5న ఆమె ఆరో స్పేస్ వాక్‌తో 44 గంటల 2 నిమిషాలు పూర్తి చేశారు. ఈ వాక్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మరమ్మతులు చేశారు. గతంలో పెగ్గీ విట్సన్ పేరుతో 39గంటల 46 నిమిషాలు ఉన్న స్పేస్ వాక్ రికార్డును సునీతా విలియమ్స్ అధిగమించారు.
ప్రపంచ బ్యాంకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బసు
భారత్‌కు చెందిన ఆర్థిక వేత్త కౌశిక్ బసు ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకానమిస్ట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా సెప్టెంబర్ 5న నియమితులయ్యారు. జస్టిస్ యుపు లిన్ స్థానంలో నియమితులైన బసు అక్టోబర్ 1 నుంచి బాధ్యతలు చేపడతారు. బసు ఇటీవల భారత ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుగా పని చేశారు. ప్రస్తుతం అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో అర్థశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

నామ్ సదస్సు
అలీనోద్యమం(నామ్) 16వ సదస్సు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఆగస్టు 31న ముగిసింది. అధ్యక్ష బాధ్యతలను ఈజిప్టు నుంచి ఇరాన్ ఈ సందర్భంగా స్వీకరించింది. ఈ సదస్సు తర్వాత విడుదల చేసిన డిక్లరేషన్‌లో శాంతికి అత్యంత ప్రాధాన్యత నిచ్చారు. పాల్గొన్న దేశాలన్నీ ఏకగ్రీవంగా నామ్ ఆశయాలు, లక్ష్యాల పట్ల తమ నిబద్ధత ను వ్యక్తం చేశాయి.
సరియా సమస్యకు శాంతియుత పరిష్కారాన్ని సదస్సు కోరింది. విదేశీ
జోక్యాన్ని వ్యతిరేకించింది. పాలస్తీనీయుల పట్ల సంఘీభావాన్ని సదస్సు
వ్యక్తం చేసింది. ఆహార భద్రత, పేదరికంపై పోరు, అభివృద్ధి చెందుతున్న దేశాల
ఆర్థిక వ్యవస్థపై వ్యాధుల, ప్రకృతి వైపరీత్యాల ప్రభావం వంటి అంశాలను
సదస్సులో చర్చించారు.అలీనోద్యమం(నామ్) 16వ సదస్సు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఆగస్టు 31న ముగిసింది. అధ్యక్ష బాధ్యతలను ఈజిప్టు నుంచి ఇరాన్ ఈ సందర్భంగా స్వీకరించింది. ఈ సదస్సు తర్వాత విడుదల చేసిన డిక్లరేషన్‌లో శాంతికి అత్యంత ప్రాధాన్యత నిచ్చారు. పాల్గొన్న దేశాలన్నీ ఏకగ్రీవంగా నామ్ ఆశయాలు, లక్ష్యాల పట్ల తమ నిబద్ధత ను వ్యక్తం చేశాయి.