March - 2012

2011-12 ఆర్థిక సర్వే
2011-12 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మార్చి 15న పార్లమెంట్‌కు సమర్పించారు.
ముఖ్యాంశాలు: దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.9 శాతంగా అంచనా. 2012-13లో 7.6 శాతంగా, 2013-14లో 8.6 శాతంగా ఉంటుందని అంచనా వేశారు.
  • తగ్గనున్న ద్రవ్యోల్బణం: 2012 మార్చి నాటికి 6.5-7 శాతంగా ఉంటుంది. 2011-12లో 250.42 మిలియన్ టన్ను లు దాటనున్న ఆహారధాన్యాల ఉత్పత్తి
  • వ్యవసాయంలో వృద్ధి 2.5 శాతం
  • 2011-12లో పారిశ్రామికవృద్ధి 4-5 శాతం
  • 2011-12లో జీడీపీలో విత్తలోటు 4.6 శాతంగా అంచనా.
  • 2011-12లో 1,34,411 కోట్లుగా సబ్సిడీల వ్యయం.
  • దీర్ఘకాలిక విదేశీ పెట్టుబడుల కోసం చర్యలు.
  • వృద్ధి చెందనున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు.
  • నాల్గో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిన భారత్ అంతర్జాతీయంగా మరింత క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉండటం.
2012-12 రైల్వే బడ్జెట్
2012-13 సంవత్సరానికి రైల్వే బడ్జెట్‌ను కేంద్ర రైల్వే శాఖా మంత్రి దినేష్ త్రివేది మార్చి 14న లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
ముఖ్యాంశాలు:
  • మొత్తం రైల్వే ప్రణాళిక: రూ. 60,100 కోట్లు
  • 2012-13లో స్థూల రైల్ ట్రాఫిక్‌ను
  • రూ. 28,635 కోట్లు పెంచడం ద్వారా
  • రూ. 1,32,552 కోట్లకు చేరుకోవాలని లక్ష్యం.
  • ప్రయాణీకుల చార్జీలు కి.మీ.కు 2 నుంచి 3 పైసల వరకు పెంపు
  • కొత్తగా 72 ఎక్స్‌ప్రెస్, 21 ప్యాసింజర్ రైళ్లు.
  • 725 కి.మీ. కొత్త లైన్ల ఏర్పాటు, 700 కి.మీ. డబ్లింగ్.
  • 2012-13లో లక్ష ఉద్యోగాల భర్తీ
  • స్టేషన్ల అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు
  • స్వతంత్ర రైల్వే భద్రతా అథారిటీ ఏర్పాటు
  • నేషనల్ హైస్పీడ్ రైల్ అథారిటీ ఏర్పాటు
  • ప్రతి ఏటా పది మంది రైల్వే క్రీడాకారులకు ‘రైల్ ఖేల్ రత్న’ అవార్డు ప్రదానం
  • ప్రపంచంలో ఇండియన్ రైల్వేలు మూడో అతి పెద్ద రైల్ రోడ్ నెట్‌వర్‌‌కను కలిగి ఉన్నాయి. 64 వేల కి.మీ. విస్తరించిన ఈ నెట్‌వర్‌‌క ద్వారా 23 మిలియన్ల ప్రయాణీకులు, 2.65 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరుగుతోంది.

కేంద్ర బడ్జెట్ 2012 - 13
కేంద్ర బడ్జెట్ 2012-13ను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మార్చి 16న పార్లమెంట్‌కు సమర్పించారు. ముఖర్జీ బడ్జెట్‌ను సమర్పించడం ఇది ఏడోసారి.
ముఖ్యాంశాలు:
మొత్తం బడ్జెట్ వ్యయం:
రూ. 14,90,925 కోట్లు
ప్రణాళికా వ్యయం: రూ. 5,21,025 కోట్లు
ప్రణాళికేతర వ్యయం: రూ. 9,69,900 కోట్లు
2012-13లో పన్ను వసూళ్ల అంచనా: రూ. 7,71,071 కోట్లు
పన్నేతర రెవెన్యూ వసూళ్లు: రూ. 1,64,614
రుణేతర మూలధన వసూళ్లు: రూ. 41,650 కోట్లు
2012-13లో జీడీపీలో విత్తలోటు: రూ. 5.1 శాతం
(ఇది 2011-12లో 5.9 శాతం)
జీడీపీలో కేంద్ర ప్రభుత్వ రుణాలు: 45.5 శాతం
  • ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి 2 లక్షల రూపాయలకు పెంపు
  • సర్వీస్ టాక్స్, ఎక్సైజ్ సుంకం 10 శాతం నుంచి 12 శాతానికి పెంపు
ప్రధాన కేటాయింపులు:
  • రక్షణ రంగం: రూ. 1,93,407 కోట్లు
  • జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్: రూ. 20,822 కోట్లు
  • విద్యా హక్కు అమలు కింద సర్వశిక్ష అభియాన్‌కు కేటాయింపు: రూ. 25,555 కోట్లు
  • ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన: రూ. 24,000 కోట్లు
  • రాష్ట్రీయ కృషి వికాస్ యోజన: రూ. 9,217 కోట్లు
  • నేషనల్ హైవే అభివృద్ధి కార్యక్రమం: రూ. 25,360 కోట్లు

Total Pageviews

1067541

Template Information

Template Information