ఉపాధి, నిరుద్యోగ సర్వే-2012
భారత్‌లో నిరుద్యోగ సమస్యపై కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ ‘ఉపాధి, నిరుద్యోగం సర్వే-2012’ను విడుదల చే సింది. 2011-13లో దేశంలో నిరుద్యోగం రేటు 3.8 శా తంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. పట్టణ నిరుద్యోగం 5 శాతం. కాగా, గ్రామీణ నిరుద్యోగం 3.4 శాతంగా ఉన్నట్లు తెలిపింది. పురుషుల్లో కంటే మహిళల్లోనే అధిక నిరుద్యోగం ఉందని పేర్కొన్నారు. మొత్తం 1.28 లక్షల కుటుంబాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నివేదికను రూపొందించినట్లు కార్మిక శాఖ వెల్లడించింది.
నివేదికలోని ముఖ్యాంశాలు:
నిరక్షరాస్యుల్లో నిరుద్యోగం రేటు 1.2 శాతంగా ఉంది. గ్రాడ్యుయేట్లలో 9.4 శాతం, పోస్టు గ్రాడ్యుయేట్లలో 10 శాతం ఉంది.
పట్టణ ప్రాంతాల్లోని గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం 8.2 శాతం, పీజీ చేసిన వారిలో 7.7 శాతంగా ఉంది. దేశంలో కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్‌ఎఫ్‌పీఆర్) 52.9 శాతం.
జాతీయ స్థాయిలో మహిళల్లో నిరుద్యోగ రేటు 6.9 శాతంగా అంచనా వేశారు. పురుషుల్లో ఇది 2.9 శాతంగా ఉంది.
ఎస్సీ, ఇతర వెనుకబడిన తరగతుల్లో నిరుద్యోగం 3.2 శాతం, ఎస్టీల్లో 2.6 శాతం చొప్పున ఉంది.
దేశంలో అత్యధికంగా 52.9శాతం మంది వ్యవసాయం, అటవీ, మత్స్య రంగంలోనే ఉపాధి పొంద గా.. సేవా రంగంలో 27.8 శాతం మంది, ఉత్పత్తి, నిర్మాణ రంగంలో 19.3 శాతం మంది ఉపాధి పొందుతున్నారు.