August - 2012

2012-13 లో 6.7 శాతం వృద్ధి 
2012-13లో స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 6.7 శాతంగా ఉండగలదని సి. రంగరాజన్ నేతృత్వంలోని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి(పీఎంఈఏసీ) రూపొందించిన ఆర్థిక వ్యవస్థ అంచనాల నివేదిక అంచనా వేసింది. ఈ నివేదికను పీఎంఈఏసీ ఆగస్టు 17న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు సమర్పించింది. వ్యవసాయ వృద్ధిరేటు 0.5 శాతంగా (2011-12లో 2.8 శాతం), తయారీ రంగ వృద్ధి రేటు 4.5 శాతంగా (2011-12లో 2.5 శాతం), మైనింగ్ రంగంలో వృద్ధి 5.3 శాతంగా (2011-12లో 3.4 శాతం), సేవల రంగంలో వృద్ధి 8.9 శాతంగా(2011-12లో 3.4 శాతం) నమోదయ్యే అవకాశం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. వాణిజ్య లోటు 18,110 కోట్ల డాలర్లుగా ఉండవచ్చని అంచనా వేసింది. దేశీయ పొదుపు రేటు 31.7 శాతంగా ఉంటుంద ని పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావం నుంచి మన ఆర్థిక వ్యవస్థ బయటపడి మళ్లీ పుంజుకోవాలంటే మౌలిక రంగంలో పెట్టుబడులను మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా రాజన్
కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా (సీఈఏ) రఘురాం జి.రాజన్ ఆగస్టు 11న నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రాజన్ గతంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు గౌరవ ఆర్థిక సలహాదారుగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో ఆర్థిక వేత్తగా పని చేశారు.
 
ఆర్‌బీఐ -త్రైమాసిక పరపతి విధానం
త్రైమాసిక పరపతి విధానాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) జూలై 31న ప్రకటించింది. రెపో రేటు 8 శాతంగా, రివర్స్ రెపో రేటు 7 శాతం కొనసాగించింది. నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్)4.75లో కూడా మార్పు చేయలేదు. చట్టబద్ద ద్రవ్య నిష్పత్తి(ఎస్‌ఎల్‌ఆర్)ని మాత్రం 24 నుంచి 23 శాతానికి తగ్గించింది. బ్యాంకులు తమ వద్ద ఉన్న నిధుల్లో కొంత భాగాన్ని ప్రభుత్వ బాండ్లలో తప్పనిసరిగా పెట్టడాన్ని ఎస్‌ఎల్‌ఆర్ అంటారు. ఎస్‌ఎల్‌ఆర్ తగ్గించడం వల్ల ద్రవ్య సరఫరా పెరుగుతుంది. ప్రస్తుత తగ్గింపులో రూ. 68,000 కోట్లు అందుబాటులోకి రాగలవని అంచనా. 2012-13 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి అంచనాలను 6.5 శాతానికి తగ్గించింది. గతంలో 7.3 శాతం వృద్ధిని అంచనా వేసింది. మార్చినాటికి ద్రవ్యోల్బణం 7 శాతానికి పెరగవచ్చని అంచనా. గతంలో ఈ అంచనా 6.5 శాతం

Total Pageviews

Template Information

Template Information