0.25 శాతం సీఆర్‌ఆర్‌ను తగ్గించిన ఆర్‌బీఐ
రిజర్వుబ్యాంకు త్రైమాసిక మధ్యంతర ద్రవ్య, పరపతి సమీక్షను సెప్టెంబర్ 17న ప్రకటించింది. బ్యాంకులు తమ డిపాజిట్లలో రిజర్వు బ్యాంకు వద్ద ఉంచాల్సిన నగదు నిల్వ నిష్పత్తి(సిఆర్‌ఆర్)ని 0.25 శాతం తగ్గించింది. దీనివల్ల బ్యాంకుల దగ్గర రూ. 17,000 కోట్ల నిధులు అందుబాటులో ఉంటాయి. రెపో రేటును(స్వల్పకాలిక రుణాలపై బ్యాంకుల నుంచి రిజర్వు బ్యాంకు వసూలు చేసే వడ్డీ రేటు) యధాతధంగా 8 శాతంగానే కొనసాగించింది. రివర్స్ రెపోరేటు(బ్యాంకులు తన వద్ద ఉంచే డిపాజిట్లపై చెల్లించే రేటు)ను కూడా 7 శాతంగానే కొనసాగించింది.
రీటైల్ రంగంలో ఎఫ్‌డీఐలు
మల్టీ బ్రాండ్ రిటైల్‌లో వ్యాపారంలో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 14న అమోదం తెలిపింది. దీనివల్ల స్థానిక రీటైల్ నెట్‌వర్క్‌లో 51శాతం విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టవచ్చు. మల్టీ బ్రాండ్ రీటైల్ రంగంలో 51 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతిస్తూ 2011 నవంబర్ 24న కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకించడంతో..ప్రభుత్వం ఈ అంశాన్ని నిలిపి వేసింది. దేశీయ విమానయాన రంగంలో విదేశీ సంస్థలు 49 శాతం పెట్టుబడులు, బ్రాడ్ కాస్టింగ్, కేబుల్ సర్వీసులు, మౌలిక సదుపాయాల్లో ఎఫ్‌డీఐల పరిమితిని 74 శాతానికి పెంచడం, ప్రభుత్వ రంగ సంస్థలైన ఆయిల్ ఇండియా, హిందూస్థాన్ కాపర్, నాల్కో, ఎంఎంటీసీలలో వాటాల విక్రయాన్ని కూడా ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.