బీమా రంగంలోకి 49 శాతం ఎఫ్‌డీఐ
బీమా రంగంలో 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర కేబినెట్ అక్టోబర్ 4న ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతమున్న 26 శాతం నుంచి 49 శాతానికి ఎఫ్‌డీఐలు పెరిగాయి. పింఛన్ రంగంలో కూడా 26 శాతం ఎఫ్‌డీఐలకు ఆమోదం తెలిపింది. అన్ని రంగాలను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిధిలోకి తెచ్చే కాంపిటీషన్ చట్టం 2002 సవరణలకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వానికి సలహాలిచ్చేందుకు 20వ లా కమిషన్‌ను ఆమోదించింది. ఈ కమిషన్‌ను 2012 -15 కాలానికి ఏర్పాటు చేస్తారు.