విదేశాల్లో 20 భారతీయ కంపెనీలకు 80 బిలియన్ డాలర్ల ఆస్తులు
విదేశాల్లో 20 భారతీయ పెద్ద కంపెనీలు కలిసి 80 బిలియన్ డాలర్లు (4 లక్షల కోట్ల రూపాయలు) ఆస్తులు కలిగి ఉన్నట్లు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) తన ట్రాన్స్‌నేషనాలిటీ ఇండెక్స్ (టీఎన్‌ఐ)లో తెలిపింది. వీటిలో మొదటి ఆరు అతిపెద్ద కంపెనీలు 50 బిలియన్ డాలర్ల ఆస్తులు కలిగి ఉన్నాయి. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, హిండాల్కో, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐదు ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) ఉన్నాయి. ఈ 20 సంస్థల విదేశీ ఆదాయం 126 బిలియన్లుగా అంచనా వేశారు.
గోధుమ ఉత్పత్తిని దెబ్బతీయనున్న వాతావరణ మార్పు
ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల గోధుమ ఉత్పత్తి ఆరు మిలియన్ టన్నులు తగ్గిపోతుందని వాతావరణ మార్పుపై ప్రభుత్వ నివేదిక తెలిపింది. దీనికి సంబంధించి భారత్ రెండో నివేదికను వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్‌కు మే 10న సమర్పించింది. భారత్‌లో 2010-11లో అత్యధిక స్థాయిలో 85.93 మిలియన్ టన్నుల గోధుమ ఉత్పత్తి జరిగింది. వాతావరణ మార్పును ఎదుర్కొనేందుకు తగు వ్యూహాలు చేపట్టాలని, అవి నష్టాన్ని తగ్గించగలవని తెలిపింది.
ఎడిన్‌బర్గ్‌లో ఠాగూర్ అధ్యయన కేంద్రం
స్కాట్‌లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ జీవితం, ఆయన రచనలపై అధ్యయనానికి ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఠాగూర్ 150వ జయంతి సందర్భంగా మే 9న ఈ కేంద్రం ఏర్పాటును ప్రకటించారు. ఈ కేంద్రానికి ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ అకడెమిక్ డెరైక్టర్ ఇంద్రా నాథ్ చౌదరి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ది స్కాటిష్ సెంటర్ ఫర్ ఠాగూర్ స్టడీస్ అట్ ఎడిన్‌బర్గ్ నాపియర్ యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటయ్యే ఈ ఇన్‌స్ట్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఇండస్ట్రీస్ భారతీయ సంస్కృతి, విద్య, తత్వం, కళలు, సాహిత్యంలో ఠాగూర్ ప్రభావాన్ని ప్రధానంగా తీసుకుంటూ వాటిని ప్రోత్సహిస్తుంది.
టి.బి. కేసులు నమోదు చేయాలని కేంద్రం ఆదేశం
ట్యూబర్ క్యులోసిస్ (టి.బి.) వ్యాధిని ‘నోటిఫైయబుల్ డిసీజ్’గా కేంద్రం మే 9న ప్రకటించింది. దీంతో ఈ వ్యాధి సోకిన ప్రతి కేసును ప్రైవేట్ డాక్టర్లు, ఆసుపత్రులు ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు టి.బి. రోగుల రికార్డును ప్రైవేట్ డాక్టర్లు నిర్వహించేవారు కాదు.
టి.బి. వ్యాధికి సరైన పరీక్షలు, వ్యాధి నియంత్రణ, వ్యాధి వ్యాప్తి చెందకుండా నివారించడం వంటి చర్యలు తీసుకోవడానకి ఈ వ్యాధికి సంబంధించిన పూర్తి సమాచారం అవసరం. మందులకు లొంగని టి.బి. దేశంలో బాగా ప్రబలుతోంది. దేశంలో ఏటా 15 లక్షల కేసులు నమోదవుతున్నాయి. 2010లో 3,60,000 మంది టి.బి. వ్యాధితో మరణించారు.
కాపీరైట్ బిల్లుకు కేంద్రం ఆమోదం
కాఫీరైట్ సవరణ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇన్నోవేషన్ వర్సిటీల ఏర్పాటు, ఉన్నత విద్యా సంస్థలకు తప్పనిసరి అక్రిడేషన్ బిల్లులకు కూడా ఆమోదం తెలుపుతూ మే 10న కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
రూ. 7 వేల కోట్ల ప్రాజెక్టులకు రక్షణ శాఖ ఓకే
ఎం 777 రకానికి చెందిన 145 అల్ట్రా లైట్ శతఘు్నల కొనుగోలు ప్రాజెక్టు సహా మొత్తం రూ. ఏడు వేల కోట్లకు పైగా రక్షణ సామగ్రి కొనుగోళ్ల ప్రాజెక్టులకు రక్షణ మంత్రిత్వ శాఖ మే 11న ఆమోదం తెలిపింది. సైనిక బలగాల ఆధునీకరణను వేగవంతం చేయడంలో భాగంగా రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలోని రక్షణ సేకరణ మండలి(డీఏసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
పార్లమెంట్ తొలి సమావేశానికి 60 ఏళ్లు
పార్లమెంట్ తొలి సమావేశం జరిగి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మే 13న లోక్‌సభ, రాజ్యసభలు ప్రత్యేకంగా కొలువుదీరాయి. ఈ సందర్భంగా తొలి లోక్‌సభకు చెందిన నలుగురు సభ్యులను మే 13న ఘనంగా సత్కరించారు.
వీరిలో రిషాంగ్ కేషింగ్(మణిపూర్), రేషమ్‌లాల్ జాంగ్డే(ఛత్తీస్‌గఢ్), మన రాష్ట్రానికి చెందిన కందాళ సుబ్రహ్మణ్య తిలక్(92), కానేటి మోహనరావు(87)లు ఉన్నారు. రిషాంగ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు. సుబ్రహ్మణ్య తిలక్ విజయనగరం నుంచి సోషలిస్ట్ పార్టీ తరపున పోటీ చేసి భారీ మెజార్టీతో తొలి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం జర్నల్ ఆఫ్ పార్టీలెస్ డెమోక్రసీ గౌరవ సంపాదకుడిగా కొనసాగుతున్నారు. తెలుగు శక్తి పేరిట స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నారు. కానేటి మోహన్‌రావు 1952లో కమ్యూనిస్టు పార్టీ తరపున రాజమండ్రి ఎస్సీ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.
రూ. 5, రూ. 10 నాణేల విడుదల
పార్లమెంట్ వజ్రోత్సవాల సందర్భంగా రూ. 5, రూ. 10 స్మారక నాణేలను రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ విడుదల చేశారు. వీటితో పాటు రాజ్యాంగ సభలో, పార్లమెంట్‌లో అప్పటి నేతలు చేసిన ప్రసంగాలతో కూడిన కొన్ని పుస్తకాలను కూడా రాష్ర్టపతి ఆవిష్కరించారు.
లోక్‌సభ మొదటి సమావేశం మే 13, 1952లో జరిగింది.
లోక్‌సభ తొలి స్పీకర్: జీవీ మౌలాలంకార్
రాజ్యసభ తొలి చైర్మన్: ఎస్. రాధాకృష్ణన్
గవర్నర్‌గా నరసింహన్ ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా రెండో సారి నియమితులైన ఈఎస్‌ఎల్ నరసింహన్ ఈ నెల 3న ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.లోకూర్ ప్రమాణస్వీకారం చేయించారు.
రవిశంకర్‌కు ఠాగూర్ అంతర్జాతీయ పుర స్కారం
సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ తొలిసారిగా ప్రదానం చేస్తున్న రవీంద్రనాథ్ ఠాగూర్ అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఠాగూర్ 150వ జయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 7న న్యూఢిల్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు. పురస్కారం పేరును ‘ఠాగూర్ అంతర్జాతీయ సాంస్కృతిక, సామరస్య అవార్డు’గా మార్చినట్లు ఆయన తెలిపారు. ఈ పురస్కారం కింద కోటి రూపాయల నగదు, ప్రశంసాపత్రం బహూకరిస్తారు. ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయానికి కేంద్ర ప్రభుత్వం రూ.150 కోట్ల గ్రాంటు ప్రకటించింది.
అశోక మిత్రన్‌కు ఎన్టీఆర్ సాహితీ పురస్కారం
ఎన్టీఆర్ ఆరో జాతీయ సాహితీ పురస్కారానికి తమిళ సాహితీవేత్త అశోకమిత్రన్ ఎంపికయ్యారు. 2007 నుంచి ప్రదానం చేస్తున్న ఈ అవార్డు కింద రూ.లక్ష నగదు, బంగారు పతకం,ప్రశంసాపత్రం అందజేస్తారు. ఎన్టీఆర్ జయంతి రోజైన ఈ నెల 28న ఈ పురస్కారాన్ని బహూకరిస్తారు.
ప్రాణహిత-చేవెళ్లపై ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఒప్పందం
ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం ఈ నెల 5న న్యూఢిల్లీలో కుదిరింది. దీని ప్రకారం ప్రాజెక్టు కోసం అంతర్రాష్ట్ర బోర్డును ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల పరిశీలనలు ఈ మండలి ఆధ్వర్యంలోనే సాగుతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో 16,40,000 ఏకరాలకు సాగునీరందుతుంది. దీంతోపాటు ప్రాజెక్టు పరిధిలోని గ్రామాలు, హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలకు తాగు నీరు, పరిశ్రమలకు అవసరమైన నీరు కూడా లభిస్తుంది.
సుకుమా కలెక్టర్‌ను విడుదల చేసిన మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లా కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ ఈ నెల 3న మావోయిస్టుల చెర నుంచి విడుదలయ్యారు. ఆయనను మావోయిస్టులు ఏప్రిల్ 21న అపహరించుకుపోయారు. రాష్ట్ర ప్రభుత్వం, మావోయిస్టుల మధ్యవర్తుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం కలెక్టర్‌ను వదిలి పెట్టారు. మధ్యవర్తులుగా ప్రొఫెసర్ హరగోపాల్, బీడీ శర్మలు మావోయిస్టులతో చర్చలు జరిపారు. ఒప్పందం ప్రకారం జైళ్లలో ఉన్న మావోయిస్టులపై కేసులను సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది.

ములాయంసింగ్‌కు ఇంటర్నేషనల్ జ్యూరిస్ట్ అవార్డు
సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, పాకిస్తాన్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ మహమ్మద్ చౌదరి సహా ఐదుగురు ప్రముఖులను ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ జ్యూరిస్ట్స్ అవార్డ్-2012కు ఎంపిక చేశారు. లండన్‌లో ఈ నెల 28న నిర్వహించే కార్యక్రమంలో బ్రిటన్ సుప్రీంకోర్టు అధ్యక్షుడు లార్డ్ ఫిలిప్స్ ఈ అవార్డులను అందజేస్తారు.